ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సార్. సంయుక్త మీనన్ కథానాయిక. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. విద్యావ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేస్తూ ట్రైలర్ అర్థవంతంగా సాగింది. విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం. పంచండి ఫైవ్‌స్టార్ హోటల్లో డిష్‌లాగా అమ్మకండి అంటూ ధనుష్ చెప్పిన సంభాషణ ఆలోచనలు రేకెత్తించేలా అనిపించాయి. విద్యావ్యవస్థ తీరుతెన్నులు, ఆ ప్రయాణంలోని సమస్యలు, సంఘటనలు ఓ సార్ జీవితాన్ని ఓ తీరానికి చేర్చాయన్నదే చిత్ర ఇతివృత్తం అని దర్శకుడు తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకి అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ` సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: ప్రకాష్ కుమార్.














