తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నిర్మాత కె.బసిరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లో ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ బసిరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బసిరెడ్డి వెంట ఎఫ్‌డీసీ చైర్మన్ పి.రామ్మోహన్ రావు కూడా ఉన్నారు.














