Namaste NRI

అసలు ఎవరు ఈ యుద్ధంలో గెలవరు

ఉక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమన్నట్లు ఒకదశలో సంకేతాలిచ్చిన రష్యా ఇప్పుడు అణుయుద్ధంలో ఎవరూ గెలవరనీ, అసలు అణుయుద్ధం వద్దేవద్దని అన్నారు.అణుయుద్ధమే జరగకూడదన్న పుతిన్‌ సందేశాన్ని రష్యా విదేశాంగ ప్రతినిధి ఇగొర్‌ విష్నేవెట్‌ స్కీ ఎన్పీటీ సమీక్ష సమావేశంలో రెండుసార్లు వినిపించారు. ఈ సదస్సు ప్రారంభమైనప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఉక్రెయిన్‌ యుద్ద ఆరంభంలో పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు అణ్వస్త్ర ఖడ్గం రaళిపించడం కిందకు వస్తాయని విమర్శించారు.  అణ్వస్త్రవ్యాప్తి నిషేద ఒప్పందం (ఎన్‌.పి.టి) కుదిరి 50 ఏళ్లయిన సందర్భంగా ఆగస్టు 1 నుంచి 26 వరకు ఐక్యరాజ్యసమితి ఆ ఒప్పంద సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని కోరుతూ 191 దేశాలు నాటి ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events