Skip to main content

Namaste NRI

అమెరికా వెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌

అమెరికా వెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌. గత కొంతకాలంగా నిలిపివేసిన టూరిస్ట్‌ వీసాల అపాయింట్‌మెంట్స్‌ తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.  2022 సెప్టెంబరులో రొటీన్‌ ఇన్‌ పర్సన్‌ టూరిస్ట్‌ వీసా అపాయింట్‌మెంట్‌లను పున ప్రారంభిస్తున్నాము. గతంలో షెడ్యూల్‌ చేసిన ప్లేస్‌హోల్డర్లు ఇప్పుడు రద్దు చేయబడ్డాయి. ప్లేస్‌హోల్డర్‌ అపాయింట్‌మెంట్‌లు రద్దు చేయబడిన దరఖాస్తుదారులు ఇప్పుడు సాధారణ అపాయింట్‌మెంట్‌లను బుక్‌ చేసుకోవడానికి షెడ్యూలింగ్‌ సిస్టమ్‌లోకి మళ్లీ లాగిన్‌ అవ్వొచ్చు అని రాయబార కార్యాలయం తెలిపింది.

Social Share Spread Message

Latest News