Namaste NRI

జో బైడెన్‌కు సౌదీ మరో షాక్‌

ఆయుధాలు ఇవ్వాలని సౌదీ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. కానీ, అమెరికా ఏవో సాకులు చెప్పి ఆయుధాల విక్రయం నిలిపివేసింది. కాలం మారింది. చమురు సంక్షోభం భగ్గుమంది. దీంతో ఇంధన ఉత్పత్తి పెంచాలని అమెరికా సౌదీని కోరింది. దీనికి అంగీకరించి పెంచింది. దాదాపు 40 ఏళ్ల అతితక్కువ పెంపు అదే కావడం అమెరికాను షాక్‌కు గురి చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టడం ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభానికి ఆజ్యం పోసింది. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పతాక స్థాయిలో 9 శాతాన్ని దాటేసింది. మరికొన్నాళ్లలో అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికలు ఉండటంతో బైడెన్‌ సర్కారులో కంగారు మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తి పెంచడం దాని లక్ష్యంగా మారింది. కానీ రష్యా బైడెన్‌ మాట వినదు. ఇక కొద్దో గొప్పో వినేది సౌదీనే. ఈ నేపథ్యంలో ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన బైడెన్‌ చమురు ఉత్పత్తి పెంచడంపై అక్కడి యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events