Namaste NRI

నాన్సీ పెలోసీ పై ఆంక్షలు విధించిన చైనా 

అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ సందర్శనకు వచ్చారు. ఈ పర్యటనను తీవ్రంగా ఖండిరచిన చైనా ఇది కచ్చితంగా తమను రెచ్చగొట్టేందుకే అని మండిపడిరది. ఈ క్రమంలోనే పెలోసీపై తీవ్రమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. చైనా ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా కూడా పెలోసీ మాత్రం తైవాన్‌ సందర్శనకు వచ్చారు. ఇది కేవలం చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే అంశం.  ఒకటే చైనా విధానాన్ని అవమానించడం కూడా. అలాగే తైవాన్‌ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఈ పర్యటన ఉంది అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే నాన్సీ పెలోసీతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events