Namaste NRI

నచ్చింది గర్ల్‌ఫ్రెండూ నుంచి దోస్త్‌ అంటే నువ్వేరా

ఉదయ్‌ శంకర్‌, జన్నీఫర్‌ ఇమ్మానుయేల్‌ జంటగా గురు పవన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఈ చిత్రంలోని దోస్త్‌ అంటే నువ్వేరా గీతాన్ని హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ పాటకు గిఫ్టన్‌ ఎలియాస్‌ స్వరాలు సమకూర్చగా మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ చిత్ర కథ కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పాట మంచి హిట్టవుతుందని నా నమ్మకం. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. నారా రోహిత్‌. సుమన్‌, మధునందన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాటలో టాలీవుడ్‌ రియల్‌ ఫ్రెండ్స్‌ అయిన ప్రభాస్‌ గోపీచంద్‌, పవన్‌ కల్యాణ్‌ త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ రామ్‌ చరణ్‌, మహేష్‌ బాబు వంశీ పైడిపల్లి లాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. ఈ చిత్రానికి అట్లూరి నారాయణరావు నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కూర్పు : సాగర్‌ ఉడగండ్ల, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events