ధ్రువ సర్జా హీరోగా చేతన్ కుమార్ తెరకెక్కించిన కన్నడ చిత్రం పుష్పరాజ్ ది సోల్జర్. రచితా రామ్ నాయిక. ఈ చిత్రాన్ని ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్, కె.రవీంద్ర కల్యాణ్‌లు తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 27న గ్రాండ్ గా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో చిత్ర పాటలు, ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని మా బ్యానర్‌లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. ఆగస్టు 27న విడుదల కానున్న మా చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య కిరణ్, టి.ప్రసన్న కుమార్, శ్రీనివాస్, రేణుక, అదిత్య, తిరుపతి రెడ్డి, పుప్పా అంకంబరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.














