Namaste NRI

శర్వానంద్‌ ఒకే ఒక జీవితం డేట్‌ ఫిక్స్‌

శర్వానంద్‌, రీతూ వర్మ జంటగా అక్కినేని అమల కీలక పాత్రలో నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబరు 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలను అద్భుతంగా చూపించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాం. తల్లికొడుకుల అనుబంధాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కింది. సినిమాలో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం అని చిత్ర బృందం  పేర్కొంది. ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌. కూర్పు: శ్రీజిత సారంగ్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events