చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయేలా సత్యం, అహింసలపై మహాత్మాగాంధీ ప్రబోధించిన సందేశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేశారు. గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్`అమెరికా మధ్య దౌత్య సంబంధాలు కూడా 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు అభివర్ణించారు. ప్రజల మధ్య ఉన్న గట్టి బంధం ద్వారా ఉభయ దేశాల భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. భారత సంతతి ప్రజలు అమెరికాను మరింత సృజనాత్మకంగా, సమ్మిళితంగా, సుదృఢంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. శాంతి, సుసంపన్నత, ప్రజా భద్రత తదితర అంశాల్లో రెండు ప్రజాస్వామ్య దేశృాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని, మున్ముందూ ఇది కొనసాగుతుందని తెaలిపారు. సవాళ్ల పరిష్కరంలో భారత్, అమెరికా పరస్పరం సహకరించుకుంటాయని తెలిపారు.














