అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి కాలిఫోర్నియాలోని కార్కోరన్ నగర మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా పరస్పర ఆత్మీయ పలకరింపులు జరగగా, భారత్–అమెరికా స్నేహ సంబంధాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, స్థానిక పరిపాలన తదితర అంశాలపై వారు చర్చించారు. మేయర్‌కు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA)సంస్థ ఫౌండర్,టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు.





























