Skip to main content

Namaste NRI

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్

పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును స్వయంగా పరిశీలించారు. అనంతరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫోటోఫ్రేమ్ వద్ద విద్యార్ధులు, వారి తల్లితండ్రులతో ఫోటోలు దిగారు.

ఈ మెగా పేరేంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు తో కలిసి విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు వచ్చారు అన్నారు. ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డుల ఏర్పాటుతో రెండేళ్ల కష్టం ఫలించింది. చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా లోకేష్ పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events