Namaste NRI

నాగశౌర్య నూతన చిత్రం షురూ

నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, శ్రీకాంత్‌ ఓదెల కెమెరా స్విఛాన్‌ చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నాం. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. నాగశౌర్య గత చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. భారీ బడ్జెట్‌తో మేకర్స్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: పవన్‌ సి.హెచ్‌, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌, నిర్మాత: చెరుకూరి సుధాకర్‌, దర్శకత్వం : పవన్‌ బాసంశెట్టి.

Social Share Spread Message

Latest News