Namaste NRI

చైనా కీలక ప్రకటన..త్వరలో భారతీయ విద్యార్థులకు

కరోనా సమయంలో భారత్‌ వెళి,్ల అక్కడే నిలిచిపోయిన విద్యార్థులకు చైనా శుభవార్త చెప్పింది. వీరితో పాటు వివిధ రకాలవారు తిరిగి చైనా రావడానికి వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా ప్రకటించింది. భారతీయ విద్యార్థులూ మీకు అభినందనలు. మీ నిరీక్షణ ఫలించింది. చైనాకు తిరిగి స్వాగతం. మీతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాం అని చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల విభాగం కౌన్సెలర్‌ జీ రోంగ్‌ తెలిపారు. విద్యార్థులకు, వ్యాపారులకు చైనాలో పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులకు సంబంధిత వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైందని ఢల్లీిలోని చైనా దౌత్య కార్యాలయం ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా వెళ్లేవారికి, నిలిచిపోయిన చదువును పూర్తి చేయాలనుకుంటున్నవారికి ఎక్స్‌`1 వీసాలను జారీ చేస్తామని తెలిపింది.

Social Share Spread Message

Latest News