Skip to main content

Namaste NRI

అమెరికా పౌరులకు మరోసారి హెచ్చరిక….  ఆ దేశాన్ని

ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు మరిన్ని దాడులకు తెగబడనున్నట్లు సమాచారం. దీంతో యూఎస్‌ ఎంబసీ మరోసారి తన దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 24 ఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రష్యా మరిన్ని దాడులకు దిగనున్నట్లు  ప్రాథమిక సమాచారం. అంతేకాదు  మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్‌ పౌర మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సౌకర్యాలకు వ్యతిరేకంగా రష్యా దాడులను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తోందని విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం పౌరులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు సురక్షితమైన అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ భూ రవాణా సౌకర్యాలను ఉపయోగించి ఉక్రెయిన్‌ నుంచి బయలుదేరమని యూఎస్‌ పౌరులను కోరింది.

Social Share Spread Message

Latest News