భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోటెత్తిన వరదతో మృతుల సంఖ్య 937కి చేరింది. 343 మంది చిన్నారులు మరణించగా దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. సింధ్ ప్రావిన్స్‌లో జూన్ 14 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా 306 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్‌లో 234 మరణాలు చోటు చేసుకోగా పతున్వఖ, పంజాబ్ ప్రావిన్స్‌లో వరుసగా 185 మంది, 165 మంది మరణించారని డిజాస్టార్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) వెల్లడిరచింది. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో వరద ఉధృతికి 37 మంది మరణించారు.














