Skip to main content

Namaste NRI

కువైత్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

గల్ఫ్‌ దేశం కువైత్‌ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆ దేశ ఆరోగ్యశాఖ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం కువైటీలకు మాత్రమే చికిత్సలు చేయాలని, ప్రవాసులను ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు పరిమితం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెల్త్‌ మినిస్ట్రీ వలసదారులను ప్రభుత్వ ఆస్పత్రులు, క్లినిక్‌లకు బదులుగా ధామన్‌లోని హెల్త్‌ హాస్పిటల్‌ కంపెనీకి తరలిస్తున్నట్లు సమాచారం.  వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్‌ సెక్టార్‌లోని కార్మికులందరినీ పూర్తిగా థామస్‌ సెంటర్‌కే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ సెక్టార్‌లో పనిచేస్తున్న ప్రవాసులకు మాత్రం కొంతకాలం మినహాయింపు ఇవ్వనుందట. ఆ తర్వాత వారిని కూడా ప్రైవేట్‌ క్లినిక్స్‌కు పంపించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రవాసులకు సంబంధించిన ఎమర్జెన్సీ కేసులకు మాత్రం చికిత్స చేయనుంది. తీవ్ర అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తారట.

Social Share Spread Message

Latest News