Skip to main content

Namaste NRI

సొంత చిత్తరువులను ఆవిష్కరించిన ఒబామా దంపతులు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన భార్య మిసెల్‌ శ్వేతసౌధనికి వచ్చారు. సంప్రదాయం ప్రకారం అధ్యక్ష భవనంలో ఏర్పాటు చేసే తమ అధికారిక చిత్తరువులను వారు ఆవిష్కరించుకున్నారు.  నూతన అధ్యక్షుడు రాగానే మునుపటి అధ్యక్షుడి చిత్రపటాలను శ్వేతసౌధంలో, జాతీయ గ్యాలరీలో ఏర్పాటు చేయయం ఆనవాయితీ. 2012 నుంచి ఇది నిలిచిపోయింది. దానిని పునరుద్ధరించిన సందర్భంగా శ్వేతసౌధానికి వచ్చిన ఒబామా దంపతులకు అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. ఒఒబామా అంటే అమెరికా ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని వారు కొనియాడారు. బైడెన్‌ అధ్యక్షునిగా ఉండడం అమెరికా అదృష్టమని ఒబామా కూడా ప్రశంసలు కురిపించారు. 2017లో పదవీకాలం ముగిశాక మిషెల్‌తో కలిసి ఒబామా మళ్లీ శ్వేతసౌధంలోకి రావడం ఇదే తొలిసారి.

Social Share Spread Message

Latest News