Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీతో భూటాన్ రాజు వాంగ్‌చుక్ భేటీ

భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ ఢల్లీిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, వాటి బలోపేతంపై వారిద్దరూ చర్చించారు. భూటాన్‌ రాజుతో సుహృద్భావ సమావేశం జరిగింది. భారత్‌` భూటాన్‌ల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు వివిధ అంశాలపై చర్చించాం అని మోదీ తెలిపారు. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌`2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి లండన్‌ వెళ్తున్న వాంగ్‌చుక్‌ మార్గమధ్యలో కొద్దిసేపు భారత్‌లో ఆగారని అధికారులు వెల్లడిరచారు.

భారత్‌ రక్షణకు  భూటాన్‌ కూడా కీలకంగా ఉంది.1968 భూటాన్‌ రాజధాని థింపులో భారత దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా విస్తరించాయి. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్ద గతంలో ఒప్పందం ఉండేది. అయితే దీన్ని 2007లో సవరించారు. భూటాన్‌ విదేశాంగ విధానానికి మార్గదర్శకం చేయడానికి భారతదేశాన్ని భూటాన్‌ అనుమతించింది. రెండు దేశాలు విదేశీ, రక్షణ వ్యవహారాల్లో సన్నిహితంగా సంప్రదించుకుంటాయి.

Social Share Spread Message

Latest News