Skip to main content

Namaste NRI

అమెరికాలో దారుణం… భారత యువకుడ్ని

అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సూపర్‌మార్కెట్‌ నిర్వహిస్తున్న భారత యువకుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. అమెరికా పోలీసులు నిందితుడిని క్రిస్‌ కోప్‌ల్యాండ్‌ (26)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జార్జియాలో చోటు చేసుకుంది. భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్‌ సింగ్‌ అమెరికాలోని జార్జియాలో గత కొంతకాలంగా సూపర్‌మార్కెట్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లజాతీయుడైన క్రిస్‌ కోప్‌ల్యాండ్‌ (26) పట్టపగలు తుపాకీతో పరమ్‌వీర్‌ నిర్వహిస్తున్న సూపర్‌ మార్కెట్‌ల్లోకి ప్రవేశించాడు. అతడిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం పరమ్‌వీర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన పరమ్‌వీర్‌ సింగ్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆ తర్వాత క్రిన్‌ కౌంటర్‌ వద్ద ఉన్న కంప్యూటర్‌ పరికరాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి  పరారయ్యాడు. జార్జియా పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు క్రిస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Social Share Spread Message

Latest News