నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్, పుష్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 25న కర్నూల్‌లోని ఎస్‌టీబీసీ మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకకు చిత్ర బృందమంతా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీ రోల్స్ పోషిస్తున్నారు. ది ఘోస్ట్‌లో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది.














