Skip to main content

Namaste NRI

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్‌) చైర్మన్‌ గా బండా శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ (ఎస్సీ మాదిగ), విద్యార్థి నాయకుని దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్‌ జిల్లా కార్యదర్శిగా పని చేశారు. హాకీ ప్లేయర్‌గా రాణించిన శ్రీనివాస్‌ హుజూరాబాద్‌ హాకీ క్లబ్‌ అధ్యక్షుడిగా, ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడుగా పని చేస్తున్నారు. హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గానూ,  జిల్లా టెలికాం బోర్డు మెంబర్‌ గానూ బండా శ్రీనివాస్‌ పని చేశారు.  హుజూరాబాద్‌ టౌన్‌ నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు.

                 టీఆర్‌ఎస్‌ పార్టీ హుజూరాబాద్‌ మండలాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరుడిగా శ్రీనివాస్‌ గుర్తింపు పొందారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events