Skip to main content

Namaste NRI

లండన్‌లో ఘనంగా భారతీయ చేనేత దినోత్సవం .. సంప్రదాయ చీర కట్టులో మెరిసిన మహిళలు

భారత జాతీయ చేనేత దినోత్సవం లండన్ లో ఘనంగా జరిగింది. తెలుగు మహిళలు సంప్రదాయ చేనేత చీరలు ధరించి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, చేనేత కళ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు లేడీస్ ఇన్ యూకే’ అనే ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ శ్రీదేవి మేనవల్లి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు మహిళలను ఏకతాటిపై తీసుకు రావడం లో ఆమె ముఖ్య పాత్ర పోషించారు.

చేనేతను ప్రోత్సాహించదం తో పాటు భారతీయ సంప్రదాయలపై అవగాహన పెంచేల నిర్వహించిన ఈ కార్యక్రమం విదేశాల్లో ఉన్న మహిళలు తమ మూలాలను గుర్తు చేసుకోడానికి గొప్ప అవకాశంగా మారింది. సెంట్రల్ లండన్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కోవెంట్రీ ,రగ్బీ ,మిల్టన్ కీన్స్, ఆమర్శమ్, తదితర ప్రాంతాల్లో మహిళలు పాల్గొన్నారు. ఉప్పాడ, పైఠాని,అజ్రఖ్, మంగళగిరి, కాంచీపురం, కోట కాటన్ వంటి విభిన్న రకాల చీరలు ధరించి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని అద్భుత మైన చేనేత కళను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

చేనేత చీరలు ధరించడం వెనుక కేవలం అందం మాత్రమే కాదు చేనేత కార్మికుల శ్రమ నైపుణ్యం సృజనాత్మక ఉంటాయని పలువురు మహిళలు తెలిపారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ వృత్తులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.స్థానికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చేనేత కార్మికులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు యూకే నలు మూలల నుంచి తెలుగు మహిళలు ఉత్సాహం గా పాల్గొని విదేశీ గడ్డపై తమ ఐక్యతను చాటారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events