కన్నడ హీరో యష్ నటిస్తున్న చిత్రం రారాజు. ఈ చిత్రంలో యష్ సతీమణి రాధిక పండిట్ నాయికగా నటించింది. మహేష్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగులో రారాజు పేరుతో ఈ నెల 14న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. హీరో యష్ ఆయన సతీమణి కలిసి నటించారు. కన్నడలో మంచి విజయం సాధించింది. కేజీఎప్ తర్వాత యష్ క్రేజ్ టాలీవుడ్లోనూ పెరిగింది. ఈ నెల 14న ఈ సినిమా రారాజు పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు. తెలుగులో కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహేష్రావు దర్శకత్వం వహించారు.














