Skip to main content

Namaste NRI

ఆదిపురుష్ పై బీజేపీ ఆగ్రహం

ప్రభాస్‌ హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమాపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రామాయణంపై కసరుత్తు చేయకుండానే సినిమా తీశారని ఆరోపిస్తున్నారు. టీజర్‌ చూస్తుంటే క్యారెక్టర్లు గందరగోళంగా ఉన్నాయంటున్నారు.  సినిమాలో రావణాసుర క్యారెక్టర్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రావణసురుడిపాత్రపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రావణుడి నుదుటిపై మూడు నామాలు మిస్సింగ్‌, రావణాసురుడి గెటప్‌ లో జంధ్యం కనిపించడం లేదని, పుష్పక విమానం స్థానంలో పక్షిని పెట్టారని, రావణుడి గెటప్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీని తలపిస్తోందని, రావణుడి కంటికి సుర్మ ఎలా పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత్రల తీరుతెన్నులు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. చరిత్రను విక్రీకరిస్తే సహించేది లేదంటూ బీజేపార్టీ హెచ్చరిస్తోంది.

Social Share Spread Message

Latest News