Namaste NRI

అరుదైన వజ్రం.. వేలంలో ప్రపంచ రికార్డు

గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ అరుదైన వజ్రం హాంకాంగ్లో జరిగిన వేలంలో రూ.412 కోట్ల ( 49.9 మిలియన్ డాలర్లు) ధర పలికింది. క్యారెట్ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు. 11.15 క్యారెట్ల ఈ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ అంచనా ధర రూ.173.5 కోట్లు ( 21 మిలియన్ డాలర్లు) గా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ సదబీస్ దీన్ని వేలం వేసింది. రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్ డైమండ్ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్ రాణి ఏలిజబెత్`2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్ స్టార్ డైమండ్ 2017 వేలంలో రూ.588 కోట్ల (71 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events