Namaste NRI

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు… అరుదైన కానుక

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ అరుదైన కానుక అందుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఈ సందర్భంగా పుతిన్కు ట్రాక్టర్ను గిఫ్ట్గా ఇచ్చారు. ట్రాక్టర్లు ఉత్పత్తిలో బెలారస్ నెంబర్ వన్. అయితే పుతిన్ బర్త్డే సందర్భంగా సెయింట్ పీటర్స్బర్గ్కు లుకషెంకో వెళ్లారు. మాజీ సోవియేట్ నేతలు కొందరు ఆ మీటింగ్కు హాజరయ్యారు. ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన పుతిన్ పై పశ్చిమ దేశాలు ఆగ్రహంతో ఉన్నా… ఆయన బర్త్డే సందర్భంగా మాత్రం సోవియేట్ నేతలు ప్రశంసలు కురిపించారు. రకరకాల ట్రాక్టర్లలో తిరగడం పుతిన్కు సాధారణంగా అలవాటే. బెలారస్ అధ్యక్షుడితో పాటు తజకిస్తాన్ అధ్యక్షుడు రెహ్మన్ కూడా ఓ గిఫ్ట్ ఇచ్చారు. రెండు రకాల పుచ్ఛకాలయను పుతిన్కు గిఫ్ట్గా ఇచ్చారు. ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన పుతిన్పై పశ్చిమ దేశాలు ఆగ్రహంతో ఉన్నా ఆయన బర్త్డే సందర్భంగా మాత్రం సోవియేట్ నేతలు ప్రశంసలు కురిపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events