Namaste NRI

ఎన్నారై సౌతాఫ్రికా ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మేల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలు

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా మీడియా ఇంచార్జ్ కిరణ్ కుమార్ బెల్లి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. యువ నాయకుడు భగత్ సాగర్ ప్రజలకు దొరకడం చాలా అదృష్టంగా భావించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నియోజకర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని తెలిపారు. యువ నాయకులు, ఉద్యమశీలి, ప్రజా నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నోముల భగత్ సాగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. నాన్న నోముల నర్సింహయ్య ఆశయ సాధనకు అనుగుణంగా, శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమములో మెదసాని నరేందర్ రెడ్డి, హరీశ్ రంగా, శ్రీధర్ రెడ్డి, శివా రెడ్డి, రాంబాబు, నరేశ్, అరవింద్, శ్రీకాంత్, మురళీ తదితరులు పాల్గొని నోముల భగత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events