Skip to main content

Namaste NRI

ఇలా చేస్తే పరిణామాలు తప్పవు …సౌదీకి జో బైడెన్ హెచ్చరిక

ఇంధన ఉత్పత్తి తగ్గించాలని సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ ప్లస్ కూటమి తీసుకున్న నిర్ణయంపై అమెరికా మండిపడ్డింది. ఇలా చేస్తే త్వరలో పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హ్చెరించారు. సౌదీతో సంబంధాలను కొనసాగించే అంశాన్ని పాలనా యంత్రాంగం పున పరిశీలిస్తోందని అద్యక్షుడి సహాయకులు వెల్లడిరచారు.
ఆగ్రరాజ్యంలో వచ్చే నెలలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్యాసోలిస్ ధరల భారం పెరిగితే ఫలితాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. ఒపెక్ ప్లస్ నిర్ణయం నేపథ్యంలో సౌదీకి అందిస్తున్న సహకారాన్ని నిలిపివేయాలని ఆ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశానికి ఆయుధాల విక్రయాలను ఏడాది పాటు నిలిపివేయాలంటూ కనెక్టికల్ సెనెటర్ రిచర్డ్ బ్లూమంటాల్, కాలిఫోర్నియా ప్రతినిధి రో ఖన్నా కాంగ్రెస్లో తీర్మానం ప్రేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే సౌదీకి విడిభాగాల విక్రయాలు, మరమ్మతు, రవాణా సేవలు నిలిచిపోతాయి.

Social Share Spread Message

Latest News