Namaste NRI

రష్యా కు ఉక్రెయిన్ షాక్.. ఆయుధాగారంపై

రష్యా దేశానికి చెందిన ఆయుధాగారంపై ఉక్రెయిన్ బలగాలు దాడులు చేశాయి. దీంతో భారీ పేలుళ్లతో ఆయుధాగారం ధ్వంసమైపోయింది. రష్యా సరిహద్దుల్లోని బెల్గరోడ్ రీజియన్లో ఉన్న ఓ గ్రామంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణులతో దాడికి పాల్పడిరదని గవర్నర్ వ్యచెస్లేవ్ గ్లాడ్కోవ్ తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ శబ్ధంతో కూడిన మంటలు ఎగసిపడ్డాయని, ఆయుధ డిపో ధ్వంసమైందని తెలిపారు. బెల్గరోడ్లోని నివాస సముదాయాలపై కూడా ఉక్రెయిన్ బలగాలు బాంబులు విసిరాయని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ సైన్యం తోసిపుచ్చింది.

Social Share Spread Message

Latest News