Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో ని న్యూస్ రివర్ గ్రీన్వే సమీపంలో తెల్లజాతీయుడైన ఓ టీనేజీ యువకుడు కాల్పులు జరపడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించామని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరణించినవారిలో ఒక పోలీస్ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుడిని ఇంకా పట్టుకోలేదని, ప్రస్తుతం అతడు ఓ గ్యారేజీలో దాకున్నాడని, పోలీసులు అతడిని చుట్టుముట్టారని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News