ప్రియాంక డే, సాయి తేజ గంజి, తన్వీర్, శివ గంగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హసీన. నవీన్ ఇరగాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో అడివి శేష్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి నాయికా ప్రాధాన్యం చిత్రం. 84 మంది కొత్త నటీనటులతో రూపొందించడం విశేషం. టీజర్ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. స్నేహితులు చివరిదాక వెంటే ఉంటారు కానీ, అన్ని సమయాల్లో కాదు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందించాం. టైటిల్ పాత్రను ప్రియాంక డే పోషించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఆకాష్ లాల్, వశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ఠ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎండీ తన్వీర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: షారుక్ షేక్, చాయాగ్రహణం : రామ్ కంద.




























