Skip to main content

Namaste NRI

లిజ్‌ ట్రస్‌కు షాక్‌.. సుయెల్లా బ్రేవ్‌మాన్‌ రాజీనామా

బ్రిటన్ హార్డ్‌లైన్ ఇంటీరియర్ మినిస్టర్ సుయెల్లా బ్రేవ్‌మాన్ రాజీనామా చేశారు. ప్రధాని లిజ్ ట్రస్ ప్రభుత్వం నుంచి వైదొలగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తను ఈ ఊబిలో చిక్కుకోకూడదనే భావనతోనే బ్రేవ్‌మాన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా విషయాన్ని తెలుపుతూ ప్రధానికి రాసిన లేఖను ఆమె పేర్కొన్నారు.. ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్ ప్రభుత్వం పన్నులు తగ్గించే విషయంలో బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. ట్రస్ నిర్ణయాలన్నీ ఒక్కొక్కటిగా విఫలం అవుతూ వస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నేతల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్రేవ్‌మాన్ ఇలా తప్పుకోవడం కొత్త ప్రభుత్వానికి గట్టి దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు.

Social Share Spread Message

Latest News