Skip to main content

Namaste NRI

మైఖేల్‌ టీజర్‌ వచ్చేసింది

సందీప్‌ కిషన్‌, దర్శకుడు రంజిత్‌ జయకోడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి. కరుణ్‌ సి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావుల సంయుక్త ప్రొడక్షన్‌ వెంచర్‌ మైఖేల్‌. దివంగత నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ సమర్పకులు. ఈ చిత్రం తెలుగు టీజర్‌ను నాని విడుదల చేశారు. దివ్యాంక కౌశిక్‌, అనసూయ గ్లామరస్‌ రోల్స్‌ కనిపిస్తుండగా, గౌతమ్‌ మీనన్‌, వరుణ్‌ సందేశ్‌, విజయ్‌ సేతుపలి స్టన్నింగ్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.   ఈ సంద్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ నాకు నేనుగా పెట్టుకున్న అతి పెద్ద టెస్ట్‌ మైఖేల్‌. దర్శకుడు రంజిత్‌ జయకోడి నాకు ఇచ్చిన యూనివర్సల్‌ గిఫ్ట్‌ ఇది అని అన్నారు. నిర్మాత పుష్కర్‌ రామ్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ సందీప్‌ కిషన్‌ ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. బలమైన కంటెంట్‌ ఉన్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో రంజిత్‌ జయకోడి, దివ్యాంక కౌశిక్‌ భరత్‌ చౌదరి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News