Skip to main content

Namaste NRI

బాస్‌ వస్తున్నాడు… మాస్‌ లుక్‌తో మెగా అప్‌డేట్‌

మాస్‌ మూలవిరాట్‌ బాస్‌ వస్తున్నాడు అంటూ సినీ ప్రియులకు కొత్త కబురు అందించింది. మెగా 154 (వర్కింగ్‌ టైటిల్‌) చిత్ర బృందం. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. శృతిహాసన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది.  బాబీ ( కె.ఎస్‌. రవీంద్ర) తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ టీజర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ఇందుకు ఇప్పుడు మూహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 24న ఇవడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరుకు  సంబంధించిన  ప్రీలుక్‌ను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మాస్‌ యాక్షన్‌ అంశాలు నిండిన ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రవితేజ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. మూడు పాటలు కొంత టాకీ పార్ట్‌ మినహా మెగా 154 షూటింగ్‌ పూర్తయినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ విల్సన్‌. ఈ చిత్రం 2023 జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News