Namaste NRI

 బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌

 బ్రిటన్‌ ప్రధానిగా  భారత సంతతికి చెందిన రిషి సునాక్‌  బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. మినీ బడ్జెట్‌తోపాటు సంపన్నులపై పన్ను కోతలు విధించడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రధానిగా లిజ్ ట్రస్‌ రాజీనామా చేశారు.  లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయడంతో బ్రిటన్‌ ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాను మళ్లీ బరిలో నిలుస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ప్రకటించారు. ఆయనకు దాదాపు 193 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్‌ (42) నిలుస్తారు. అంతే కాదు తొలిసారి భారత సంతతి నాయకుడు బ్రిటన్‌కు సారధ్యం వహిస్తున్న రికార్డు నెలకొల్పుతారు. ఆయనకు ప్రత్యర్థిగా పెన్నీ మోర్డాంట్‌ పోటీ చేస్తానని ప్రకటించినా ఆచరణలో ఆమె 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టలేకపోయారు. దీంతో ఆమె ప్రధాని రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు తెలిపారు.

……………

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events