అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దసరా వేడుకలు జరుపుకున్నారు. ప్రముఖ భారతీయులందరినీ కమలా హ్యారిస్ దంపతులకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్ అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దిపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటి తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి అని కమలా హ్యారిస్ తెలిపారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు.














