Skip to main content

Namaste NRI

 లండన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు దేశ విదేశాల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. లండన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఇన్‌ లండన్‌ ఆధ్వర్యంలో బ్రెంట్వుడ్‌లో జరిగిన వేడుకల్లో  సుమారు వందలాది మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి శ్రీనివాస డబ్బీరు, ప్రముఖ వ్యాపారవేత్త అయ్యప్ప గార్లపాటి మాట్లాడుతూ భారతీయులు అందరు కలిసి దీపావళి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  కార్యవర్గ సభ్యులు శ్రీలక్ష్మి వేముల, రుద్ర వర్మ బట్ట, శ్రీనివాస రెడ్డి, చెన్న రావు వేము, నరేంద్ర మున్నలూరి, శిరీష డబ్బీరు, విరిత, హైమ కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వాసులంతా ఒకే చోటకు చేరి ఈ వేడుకలన్ని నిర్వహించారు. బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. తెలంగాణ సంప్రదాయలను గౌరవిస్తూ ప్రతి ఏటా బతుకమ్మ మేడుకలు జరుపుకుంటామని అక్కడి వాసులు అన్నారు.    

Social Share Spread Message

Latest News