Skip to main content

Namaste NRI

వారసుడు వర్కింగ్‌ స్టిల్స్‌ రిలీజ్‌

విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా వారిసు (తెలుగులో వారసుడు). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై  దిల్‌ రాజు. శిరీష్‌, పరమ్‌ వి. పొట్లూరి, పెరల్‌ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త వర్కింగ్‌ స్టిల్స్‌ను రిలీజ్‌ చేశారు. శరత్‌ కుమార్‌, ప్రభు, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ, శ్యామ్‌, యోగిబాబు, సంగీత, ఖుష్భూ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీత దర్శకుడు. హర్షిత్‌ రెడ్డి, హన్షిత సహ` నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News