Namaste NRI

ఫీల్‌ గుడ్‌ మూవీ ఆకాశం : అశోక్‌ సెల్వన్‌

అశోక్‌ సెల్వన్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న చిత్రం ఆకాశం. ఈ చిత్రం నీదా ఒరు వానమ్‌గా తమిళంలో నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్‌18, రైజ్‌ ఈస్ట్‌ బ్యానర్లపై ఆర్‌ఎ కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.  ఈ చిత్రంలో రీతూవర్మ, అపర్ణ, బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు ఆర్‌కె కార్తీక్‌ మాట్లాడుతూ నేను తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ చేయాలనుకున్నానని, అది ఆకాశం సినిమాతో కుదిరిందన్నారు. లవ్‌, ఎమోషన్స్‌, ఉన్న మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ కథ అన్నారు. ఈ సినిమా చూస్తే మీరు ప్రేమలో పడతారని అన్నారు. అందరి సహకారం కావాలన్నారు. అనంతరం  హీరో అశోక్‌ సెల్వన్‌ మాట్లాడుతూ తాను ఇంతకు ముందు నిన్నలా నిన్నలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తే, నన్నెంతో ఆదరించారన్నారు. ఇప్పుడు ఆకాశం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని అన్నారు. ఇదొక మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ అన్నారు. దీన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాని అన్నారు.  మీ ప్రేమాభిమానులు ఎప్పటికీ కావాలన్నారు. మంచి కథతో ఈ చిత్రం రాబోతోందన్నారు.  ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ శివాత్మిక, సాగర్‌, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. నవంబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events