అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా చేస్తున్న సంయుక్త వైమానిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొరియా ద్వీపకల్పంలో శాంతిభద్రతలను అమెరికా నాశనం చేస్తోందని దుయ్యబట్టింది. దురాక్రమణకు సాహసిస్తే దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించింది. ఉత్తర కొరియా తరచూ క్షిపణి పరీక్షలు చేస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా 200 యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తున్నాయి.














