Skip to main content

Namaste NRI

రష్యాకు మరో ఎదురుదెబ్బ .. ఉక్రెయిన్‌ దాడిలో

రష్యాపై ఉక్రెయిన్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా సరైన శిక్షణ, ఆయుధాలు లేని మాస్కో రిజర్విస్టు సైనికులను లక్ష్యంగా  చేసుకుని నిర్వహిస్తున్న దాడుల్లో ఉక్రెయిన్‌ ఊహించని విజయాలు సాధిస్తోంది. దీంతో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ మిలిటరీ దాడిలో వెయ్యి మంది రష్యా సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగిన తర్వాత రష్యా మరోసారి ఇంత పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది. సైన్యంలోకి కొత్తగా రిక్రూట్‌ చేసుకున్న సైనికులను సరిహద్దుల వద్దకు రష్యా తరలించింది. అయితే కనీస ఆయుధాలు లేని రష్యా సైనికులపై ఉక్రెయిన్‌ దళాలు దాడి చేశాయి. దీంతో గత 24 గంటల్లో వెయ్యి మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71, 200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారయి. మరో వైపు ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నది.

Social Share Spread Message

Latest News