Namaste NRI

హిట్‌ -2 కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను : అడివి శేష్‌

అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ హిట్‌`2. ది సెకండ్‌కేస్‌ ఉపశీర్షిక.  శైలేష్‌ కొలను దర్శకుడు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మించారు. డిసెంబర్‌ 2న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అడివి శేష్‌ మాట్లాడుతూ మంచి సినిమా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్‌ సమయంలో హిట్‌ 2 చేయటానికి టీమ్‌ ఎంతో కష్టపడిరది.  ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు అన్నారు. మహేశ్‌గారు మేజర్‌, నాటి హిట్‌  2 సినిమాలు నాతో నిర్మించడం హ్యాపీ. హిట్‌ 2 రిలీజ్‌ కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను అన్నారు.  హిట్‌తో హిట్‌ సాధించాం. హిట్‌ 2 ని స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను  అన్నారు ప్రశాంతి త్రిపిరనేని. క్రైమ్‌ ఇన్వెనిస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ హిట్‌ 2.  అడివి పర్‌ ఫెక్ట్‌ జెంటిల్‌మేన్‌ సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. నేను ఇక్కడ ఉండగటానికి కారణం నానీ గారే. ఆయనకు థ్యాంక్స్‌ అన్నారు శైలేష్‌ కొలను. ఈ  కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ మణికందన్‌.ఎస్‌, ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌, హీరోయిన్‌ కోమలీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events