Namaste NRI

వారసుడు ఫస్ట్‌ సింగిల్‌ రంజితమే విడుదల

విజయ్‌ కధానాయకుడిగా నటిస్తున్న చిత్రం వారసుడు.  వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుంచి రిలీజైన ప్టోర్‌లు సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి.  తాజాగా చిత్రబృందం పాటకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. విజయ్‌, రష్మిక రొమాంటిక్‌ లుక్‌తో ఈ పోస్టర్‌ను చిత్ర బృందం డిజైన్‌ చేశారు. రంజితమే అంటూ సాగే ఈ పాట గ్లింప్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థమన్‌ సంగీతం అందించిన ఈ పాటను ఎమ్‌.ఎమ్‌ మానసితో కలిసి విజయ్‌ ఆలపించాడు. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ పతాకాలపై దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే  ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News