Skip to main content

Namaste NRI

భేదియా నుంచి చిలిపి వరాలే ఇవ్వు సాంగ్‌ రిలీజ్‌

వరుణ్‌ ధావన్‌,  కృతీ సనన్‌ జంటగా అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భేదియా. దినేష్‌ విజన్‌ నిర్మించారు.  సచిన్‌ జిగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని చిలిపి వరాలే ఇవ్వు.. అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అమితాబ్‌ భట్టాచార్య`యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించిన ఈ పాటని కార్తీక్‌ పాడారు. హారర్‌, కామెడీ చిత్రమిది. చిలిపి వరాలే ఇవ్వు పాట చాలా బాగుంటుంది అని  చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఈ నెల 25న విడుదల కానుంది. నిర్మాత అల్లు అరవింద్‌ భేదియా ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News