Skip to main content

Namaste NRI

 ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత్‌ టీజర్‌ లాంచ్‌

 ప్రశాంత్‌ కార్తీ, రితిక చక్రవర్తి జంటగా తెరకెక్కుతున్న చిత్రం అనంత. మధుబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ప్రశాంత్‌ నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్నమైన అంశాన్ని స్పృశిస్తూ రూపొందిన చిత్రమిది. థ్రిల్లర్‌, మైథలాజికల్‌, సైకలాజికల్‌ అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాం. అంతర్జాతీయ అంశంతో రూపొందించిన ఈ సినిమా వినోదం తోపాటు, కొత్త విషయాల్ని  తెలుసుకునేలా చేస్తుందన్నారు. మధుగారు ఈ స్టోరీ చెప్పగానే వర్కవుట్‌ అవుతుందా? అనుకున్నాను. కానీ సినిమా బాగా వచ్చింది అన్నారు ప్రశాంత్‌ కార్తీ. ఈ చిత్రానికి సంగీతం : ఘంటసాల విశ్వనాథ్‌, కెమెరా: సిద్ధు సోమిశెట్టి.

Social Share Spread Message

Latest News