ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తోన్న యుద్ధం ముగింపునకు ఇదే ఆరంభమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. రష్యా దళాల నుంచి విముక్తి పొందిన ఖేర్సన్ పట్టణంలో జెలెన్స్కీ పర్యటించారు. ఆ సిటీలో ఉన్న ఉక్రెయిన్ దళాలతో ఆయన ముచ్చటించారు. దేశం ముందు వెళ్తోందని, శాంతి కోసం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మార్చి నెలలో ఖేర్సన్ సిటీని రష్యా దళాలు హస్తగతం చేసుకున్నాయి. కానీ ఉక్రెయిన్ దళాలు ఖేర్సన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. గత వారం ఆ నగరం మళ్లీ ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్లింది. ఖేర్సన్ వెళ్లిన జెలెన్స్కీ అక్కడ ఉన్న దళాలతో మాట్లాడారు. తాము శాంతి కోసం సిద్ధంగా ఉన్నామన్నారు. రష్యాపై యుద్ధంలో సహకరించిన నాటో దళాలు, ఇతర కూటములకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన హిమార్స్ రాకెట్లతో శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడిరచారు.














