Namaste NRI

వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తాం : పుతిన్‌

రష్యా సైన్యాన్ని విమర్శించినా, తప్పుడు ప్రచారం చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇందుకోసం అధ్యక్షుడు పుతిన్‌ రష్యా పార్లమెంట్‌ ఆమోదించిన ఓ చట్టానికి సవరణలను ప్రతిపాదించారు. రష్యా సైన్యాన్ని విమర్శించేవారిని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిని నేరస్థులుగా పరిగణించి వారి రష్యన్‌  పాస్‌పోర్టులను, పౌరసత్వాన్ని  రద్దు చేయాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వారి పౌరసత్వాన్ని  రద్దు చేసేలా అధికారులకు వీలు కల్పించనున్నారు.  రష్యాలో కొత్త భూభాగాల విలీనం ఫలితంగా పాస్‌పోర్టు ద్వారా రష్యా పౌరసత్వాన్ని పొందినవారిని ఈ చట్టం టార్గెట్‌ చేయనున్నది.

Social Share Spread Message

Latest News