పృథ్విరాజ్ సుకుమారన్, నయనతార జంటగా నటించిన చిత్రం గోల్డ్. ఆల్ఫోన్స్ పుతేరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మొబైల్ షాపు యజమాని కొన్న కారు చుట్టూ తిరిగే కథతో సాగుతుంది. ప్రేమమ్ లాంటి చిత్రాలతో విజయాలు అందుకున్న ఆల్ఫోన్స్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాని థియేటర్లలో వచ్చే నెల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.














