Namaste NRI

సీతారం సిత్రాలు టైటిల్‌ లోగో

లక్ష్మణ్‌, భ్రమరాంబిక, కిశోర్‌ దాత్రిక్‌  హీరో హీరోయిన్లుగా నటిస్తున్నా చిత్రం సీతారాం సిత్రాలు. నాగ శశిధర్‌ రెడ్డి దర్శకుడు. పార్ధసారధి, డి నాగేందర్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌, డైరెక్టర్‌ గుహన్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ  టైటిల్‌ కొత్తగా ఉంది. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అందరినీ అలరించాలని ఆశిస్తున్నానని అన్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ  కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న చిద్రమిది. ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుంటుంది. నేటి యువతరానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి అన్నారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల కానుందని తెలిపారు.  ఈ చిత్రానికి సంగీతం: రుద్రకిరణ్‌.

Social Share Spread Message

Latest News